దొరికిన మృతదేహం శ్రీహర్షదేనని ఇంకా తేల్చని లండన్ పోలీసులు!

  • గత నెల 21న అదృశ్యం
  • నిన్న మృతదేహం లభ్యమైనట్టు వార్తలు
  • డీఎన్ఏ టెస్ట్ కు పంపిన పోలీసులు
లండన్ లోని ఓ బీచ్ వద్ద గత నెల 21న అదృశ్యమైన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడు ఉజ్వల శ్రీహర్ష ఆచూకీ ఇంకా మిస్టరీగానే ఉంది. చదువుకునేందుకు లండన్ వెళ్లిన శ్రీహర్ష మృతదేహం నిన్న లభ్యమైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మృతదేహం శ్రీహర్షదేనని ఇంకా పోలీసులు తేల్చలేదు. ఈ విషయాన్ని ఉదయ్ ప్రతాప్ స్వయంగా మీడియాకు తెలిపారు.

శ్రీహర్ష మృతిపై లండన్ పోలీసులు నిర్ధారణ చేయలేదని, ఓ మృతదేహం మాత్రం దొరికిందని, దానికి కాస్తంత దూరంలో తన కుమారుడి పర్సు లభించిందని, ఈ కారణంగా అది శ్రీహర్ష మృతదేహమని చెప్పలేమని అక్కడి అధికారులు తనకు సమాచారం ఇచ్చారని అన్నారు. మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారని చెప్పారు. శ్రీహర్ష ఆచూకీ కోసం బ్రిటన్ లోని తెలుగువారు ఎంతో సాయం చేస్తున్నారని చెప్పారు. పోలీసులకు లభ్యమైన మృతదేహానికి డీఎన్ఏ టెస్ట్ పూర్తయితేనే విషయం తెలుస్తుందని అన్నారు.
Go Back to Shorts
London
Sri Harsha
Missing
Police
DNA Test

More Telugu News